Share News

అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:15 AM

బొబ్బిలిలోని సింగార పు వీధికి చెందిన సిరిపురపు సాయిసురేష్‌ (25) శనివారం ఆత్మహత్య చేసుకున్నారు.

అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య

బొబ్బిలి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలిలోని సింగార పు వీధికి చెందిన సిరిపురపు సాయిసురేష్‌ (25) శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై సీఐ కటకం సతీష్‌ కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సాయిసురేష్‌ విద్యుత్‌ శాఖలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన తండ్రి విద్యుత్‌ శాఖలో పనిచేసి మృతి చెందడంతో ఆ ఉద్యోగాన్ని సాయిసురేష్‌ తల్లి ఆదిలక్ష్మికి ఇచ్చారు. ఆమె కూడా పార్వతీపురం విద్యుత్‌ కార్యాలయంలో పనిచేస్తోంది. సాయి సురేష్‌కు అప్పులు ఎక్కువగా ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించా రు. సాయిసురేష్‌కు తమ్ముడు రవితేజ ఉన్నాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. ఎస్‌ఐ రమేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం తెలియగానే ఎమ్మెల్యే బేబీ నాయన ఆసుపత్రికి వెళ్లి సాయిసురేష్‌ కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Updated Date - Sep 14 , 2025 | 12:15 AM