Share News

ఆకస్మిక తనిఖీ

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:29 AM

మొంఽథా తుఫాన్‌ నేపథ్యంలో అధికారులు ఏవిదంగా విధులు నిర్వహిస్తున్నారని తెలుసుకునేందుకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం రాత్రి 10.45 గంటలకు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు.

ఆకస్మిక తనిఖీ

విజయనగరం/ భోగాపురం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మొంఽథా తుఫాన్‌ నేపథ్యంలో అధికారులు ఏవిదంగా విధులు నిర్వహిస్తున్నారని తెలుసుకునేందుకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం రాత్రి 10.45 గంటలకు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అయితే కార్యాలయంలో ఏఎస్‌వో వి.సన్యాసిరావు, వీఆర్‌ఏ విధుల్లో ఉన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ ఎం.రమణమ్మ, ఆర్‌ఐ గోపాలకృష్ణ నిమిషాల్లో కార్యాలయానికి చేరుకున్నారు. వర్షం నమో దు, తీర గ్రామాలు, పునరావస కేంద్రాలు తదితర వాటిపై ఆయన తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. 29వ తేదీ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలని.. ప్రజలకు ఎటు వంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎంపీ సూచించారు. భోగాపురం టోల్‌ఫ్రీ నెంబరు 9908583977ను కార్యాలయ ఆవరణలో పెద్ద అక్షరాలతో అతికించాలని సూచించారు.

Updated Date - Oct 28 , 2025 | 12:29 AM