Sub-Registrar Offices సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలు కిటకిట
ABN , Publish Date - May 14 , 2025 | 11:06 PM
Sub-Registrar Offices Abuzz with Activity మ్యారేజ్ సర్టిఫికెట్ల కోసం ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. నూతన రేషన్ కార్డుల కోసమే వారంతా ఈ తిప్పలు పడుతున్నారు.
రేషన్‌కార్డు పొందాలంటే దంపతులకు అది తప్పనిసరి
బెలగాం, మే 14 (ఆంధ్రజ్యోతి): మ్యారేజ్ సర్టిఫికెట్ల కోసం ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. నూతన రేషన్ కార్డుల కోసమే వారంతా ఈ తిప్పలు పడుతున్నారు. కొత్తగా కార్డులో భార్య పేరు చేర్చాలన్నా, విడిగా దంపతులు నూతన కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా.. మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పనిసరి. అయితే మూడు నెలల కిందట వివాహాలైన వారంతా సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. ఆ కాల వ్యవధి దాటిన వారంతా ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. దీంతో గత మూడు రోజులుగా పార్వతీపురం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం కిటకిటలాడుతోంది. బుధవారం కూడా సందడిగా మారింది. ఒక్క రోజే సుమారు 20 మ్యారేజ్ రిజిస్ర్టేషన్లు అయినట్టు సబ్‌రిజిస్ట్రార్ వి.నాగరాజు తెలిపారు. కాగా కొంతమందికి మ్యారేజ్ సర్టిఫికేట్ ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.