లోబరచుకుని.. గర్భవతిని చేసి..
ABN , Publish Date - May 25 , 2025 | 11:58 PM
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారి తప్పాడు.
-పోలీసులకు అందని ఫిర్యాదు
-రాజీ చర్చలతో ఆలస్యంగా వెలుగులోకి..
రేగిడి, మే 25 (ఆంధ్రజ్యోతి): విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారి తప్పాడు. ఓ విద్యార్థినికి ప్రేమ పాఠాల చెప్పాడు. లైంగి కంగా లోబరచుకుని గర్భవతిని చేశాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులకూ సమాచారం లేదు. మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలో ఓగ్రామానికి చెందిన విద్యార్థిని ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. సదరు విద్యార్థిని తండ్రి చాన్నాళ్ల కిందట మృతి చెందారు. తల్లి వేరేచోట ఉండటంతో తాత ఇంట్లో ఉంటూ చదువుకొంటోంది. ఈక్రమంలో అదే పాఠశాలకు చెందిన ఓ ఉపాఽధ్యాయడు విద్యార్థినిపై కన్నే శాడు. విద్యార్థినిని లోబరుచుకుని లైంగకంగా దాడి చేశాడు. వేసవి సెలవు లకు తల్లి వద్దకు వెళ్లిన బాలిక అక్కడ అస్వస్థతకు గురైంది. వైద్య పరీక్షలో గర్భవతి అని రిపోర్టు వచ్చినట్టు సమాచారం. దాంతో కుటుంబ సభ్యులు ఉపాఽధ్యాయుడిని పెద్దల సమక్షంలో నిలదీసినట్టు తెలుస్తోంది. విద్యార్థిని తల్లి నివాసం ఉంటున్న గ్రామంలో వారి కుటుంబానికి పెద్దగా అండ లేకపోవటం, పరువుకు సంబంధించిన విషయం కావటంలో వారు ఈ విషయాన్ని బయట పెట్టలేదు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఫమండలంలో తొమ్మిదో తరగతి విద్యార్థినిని ఉపాధ్యాయడు గర్భవతిని చేశాడన్న విషయంపై ఎస్‌ఐ నీలావతి వివరణ కోరగా.. దానిపై ఎ టువంటి ఫిర్యాదు రాలేదన్నారు. బాలికలపై ఎవరు అఘాయిత్యానికి ఒడి గట్టినా పోక్సో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.