Sub-Collectors విధుల్లోకి సబ్ కలెక్టర్లు
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:14 AM
Sub-Collectors Assume Charge పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లుగా నియామకమైన వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత వారు కలెక్టరేట్‌లో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ శోభికను మర్యాదపూర్వకంగా కలిశారు.
పార్వతీపురం, ఆగస్టు11(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లుగా నియామకమైన వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాఽథ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత వారు కలెక్టరేట్‌లో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ శోభికను మర్యాదపూర్వకంగా కలిశారు. వారు 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు. శిక్షణ పూర్తి చేసుకుని నూతనంగా జిల్లాలో పోస్టింగ్‌లు పొందారు. ఇంతవరకు పాలకొండ, పార్వతీపురం సబ్ కలెక్టర్లుగా, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోలుగా యశ్వంత్‌కుమార్‌రెడ్డి, అశుతోష్ శ్రీవాత్సవ పనిచేశారు.