విద్యార్థులు సమయపాలన పాటించాలి
ABN , Publish Date - Jun 02 , 2025 | 12:23 AM
విద్యార్థులు సమయపాలన పాటిస్తే తమ లక్ష్యాలను చేరుకోగలరని మన్యం జిల్లా న్యాయాధికారి ఎస్. దామోదరరావు తెలిపారు.
పార్వతీపురంటౌన్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి):విద్యార్థులు సమయపాలన పాటిస్తే తమ లక్ష్యాలను చేరుకోగలరని మన్యం జిల్లా న్యాయాధికారి ఎస్. దామోదరరావు తెలిపారు. ఆదివారం పట్టణ శివారుల్లో గల ఆశాజ్యోతి చారి టబుల్‌ట్రస్టు ఆధ్వర్యంలో పదోతరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థి జీవితానికి దిక్సూచి కావాలే కాని, నాశనం చేయకూడదన్నారు. కాలా నికి కట్టుబడిఉండేలా విద్యార్థి తన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆశాజ్యోతి చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు జల్లు వినయ్, వ్యవ స్థాపక సభ్యులు బి.నాగభూషణరావు, జగదీష్, పి.సాయికిరణ్ పాల్గొన్నారు.