Share News

students first against government దద్దరిల్లిన కలెక్టరేట్‌

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:32 AM

students first against government విద్యార్థుల నిరసనతో కలెక్టరేట్‌ సోమవారం దద్దరిల్లింది. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీగా కలెక్టరేట్‌ను ముట్టిడించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ వేలాదిమంది కాంప్లెక్స్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ చేపట్టారు.

students first against government దద్దరిల్లిన కలెక్టరేట్‌
కలెక్టరేట్‌కు పెద్ద ఎత్తున చేరుకున్న విద్యార్థులు

దద్దరిల్లిన కలెక్టరేట్‌

సమస్యలపై కదంతొక్కిన విద్యార్థి లోకం

విజయగనరం టౌన్‌, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల నిరసనతో కలెక్టరేట్‌ సోమవారం దద్దరిల్లింది. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీగా కలెక్టరేట్‌ను ముట్టిడించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ వేలాదిమంది కాంప్లెక్స్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్‌కు చేరుకున్నాక ధర్నా చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.రాము, సీహెచ్‌ వెంకటేష్‌లు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా విద్యారంగ సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయడంలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు రూ.6,400 కోట్ల ఉపకార వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని, తక్షణమే వాటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. గజపతినగరం, విజయనగరం, రాజాం ప్రాంతాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సొంత భవనాలు లేక అరకొర సదుపాయలతో విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారన్నారు. శిథిలావస్థలో ఉన్న సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, మెస్‌ చార్జీలు రూ.3 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ నిర్మాణం వేగవంతం చేయాలని, మెడికల్‌ కళాశాల నిర్మాణం వేగవంతం చేసి కళాశాలలో ఉన్న సీట్లన్నీ కన్వీనర్‌ కోటాలోనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం విద్యార్థి ప్రతినిధులు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కలిసి జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు జే.రవికుమార్‌, ఎం.వెంకీ, సమీరా, రమేష్‌, జిల్లా సహాయ కార్యదర్శులు శిరీష, రాజు, జిల్లా కమిటీ సభ్యులు భారతి, రూప, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 12:32 AM