జ్వరంతో విద్యార్థిని మృతి
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:52 PM
బొబ్బిలి మండలం లోని గోపాలరాయుడిపేట పంచాయతీ పరిధిలోగల కృపావలసకు చెందిన విద్యార్థిని తాడంగి పల్లవి(11) విశాఖ కేజీహెచ్‌లో చికిత్సపొందుతూ మృతి చెం దింది.
బొబ్బిలి/ సాలూరు రూరల్ అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మండలం లోని గోపాలరాయుడిపేట పంచాయతీ పరిధిలోగల కృపావలసకు చెందిన విద్యార్థిని తాడంగి పల్లవి(11) విశాఖ కేజీహెచ్‌లో చికిత్సపొందుతూ మృతి చెం దింది. పల్లవి తండ్రి బిహనో, ఏటీడబ్ల్యువో ఆర్.కృష్ణవేణి కథనం మేరకు.. సాలూ రు మండలంలోని మామిడిపల్లి గిరిజన ఆశ్రమపాఠశాలలో పల్లవి ఏడో తరగతి చదువుతోంది. గతనెల 21న దసరా సెలవులకు ఇంటికి వెళ్లినా, సెలవుల అనంత రం పాఠశాలకు చేరుకోలేదు. ఇంతలో ఈనెల ఆరో తేదీన జ్వరంగా ఉండడంతో అదేరోజు బొబ్బిలి కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మెరుగు పడక పోవడంతో వైద్యుని సూచన మేరకు ఈనెల ఎనిమిదో తేదీన విజయనగరం ఘోషాసుపత్రికి తీసుకువెళ్లారు. ఈలోగా పాఠశాల సిబ్బంది ఆరాతీయగా అనా రోగ్యంతో విశాఖ ఘోషాసుపత్రిలో చికిత్స పొందుతోందని కుటుంబసభ్యులు చెప్పడంతో ఆసుపత్రికి వెళ్లి పల్లవి ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. ఘోషాసుపత్రిలో అక్కడ కూడా నయంకాకపోవడంతో ఈనెల 11న విశాఖ కేజీ హెచ్‌కు తరలించారు. బీపీ, జ్వరం ఎక్కువై ఫిట్స్‌లా వచ్చింది. ఆదివారం ఉద యం కేజీహెచ్‌లో చికిత్సపొందుతున్న సమయంలో కొంతమెరుగైంది. ఆ సమ యంలో కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడింది. ఇంతలో అక్కడ చికిత్స పొం దుతూ ఈనెల 12వ తేదీ మధ్యాహ్నం పల్లవి మృతిచెందింది. ఈ మేరకు 13న కృపావలసలో అంత్యక్రియలు నిర్వహించారు. బిహనో ఇద్దరు కుమార్తెలు, ఇద్ద రు కుమారులు. పల్లవి రెండో కుమార్తె. పల్లవి మృతితో కుటుంబ సభ్యులు రోది స్తున్నారు. కాగా ఈనెల ఆరోతేదీ రాత్రి పది గంటలకు పల్లవిని ఆసుపత్రికి తీసు కొచ్చారని, పరిస్థితి విషమించడంతో అదేరోజు రాత్రి 12 గంటలకు 108లో విజ యనగరంతరలించినట్లు సీహెచ్‌సీ వైద్యాధికారి బి.శశిభూషణరావు తెలిపారు.