Struggles for Urea యూరియా కోసం పాట్లు
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:01 PM
Struggles for Urea జిల్లా రైతులకు యూరియా కొరత వేధిస్తోంది. వరినాట్లు వేసి నెల రోజులు కావస్తున్నా.. ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం పలగర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 260 యూరియా బస్తాలు వచ్చాయి. ఈ సమాచారం తెలుసుకున్న వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని క్యూ కట్టారు.
బలిజిపేట, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): జిల్లా రైతులకు యూరియా కొరత వేధిస్తోంది. వరినాట్లు వేసి నెల రోజులు కావస్తున్నా.. ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం పలగర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 260 యూరియా బస్తాలు వచ్చాయి. ఈ సమాచారం తెలుసుకున్న వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని క్యూ కట్టారు. దీంతో స్థానిక పోలీసుల సహకారంతో మండల వ్యవసాయాధికారి గణేష్ ఆధ్వర్యంలో పట్టాదారు పాస్‌పుస్తకం ప్రతులు తీసుకొచ్చిన వారికి ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు. దీనితో రైతులు ఆందోళనకు దిగారు. చాలీచాలని యూరియా పంపిణీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో యూరియా అందిం చాలని డిమాండ్ చేశారు. ఇదే అదునుగా ప్రైవేట్ వ్యాపారులు అధిక ధరలకు ఎరువులు విక్రయించి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని పలువురు వాపోయారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరారు.