Share News

Gurajada’s గురజాడ ఆశయ సాధనకు కృషి

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:59 AM

Striving to Realize Gurajada’s Ideals గురజాడ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. గురజాడ వర్ధంతి సందర్భంగా ఆదివారం పార్వతీపురం సబ్‌ కలెక్టరేట్‌ వద్ద ఆయన విగ్రహానికి కలెక్టర్‌ పూలమాలలు వేసి నివాళి అర్పించారు

  Gurajada’s   గురజాడ ఆశయ సాధనకు కృషి
గురజాడ అప్పారావుకి నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌

బెలగాం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): గురజాడ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. గురజాడ వర్ధంతి సందర్భంగా ఆదివారం పార్వతీపురం సబ్‌ కలెక్టరేట్‌ వద్ద ఆయన విగ్రహానికి కలెక్టర్‌ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారుల్లో గురజాడ అప్పా రావు ఒకరిని కలెక్టర్‌ తెలిపారు. కన్యాశుల్కం నాటకంతో సమాజాన్ని మేల్కొలిపిన అభ్యు దయ కవితా పితామహుడు గురజాడ అని కొనియాడారు. తెలుగు భాష అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వారిలో ఆయన ముఖ్యలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ వైశాలి, సాహితీ వేత్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2025 | 12:59 AM