Share News

సుపరిపాలన అందించేందుకు కృషి

ABN , Publish Date - Apr 25 , 2025 | 11:53 PM

:సుపరిపాలన అందించేందుకు కృషిచేస్తానని నెల్లి మర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. శుక్రవారం మండలంలోని ఒమ్మి గ్రామంలో జనవాణి-మాధవమ్మ భరోసా కార్యక్రమం జరిగింది.

 సుపరిపాలన అందించేందుకు కృషి
ఒమ్మిలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న నాగమాదవి

నెల్లిమర్ల, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి):సుపరిపాలన అందించేందుకు కృషిచేస్తానని నెల్లి మర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. శుక్రవారం మండలంలోని ఒమ్మి గ్రామంలో జనవాణి-మాధవమ్మ భరోసా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామం లో పర్యటించి వీధుల్లో పారిశుధ్యపై ఆరాతీశారు. గ్రామస్థుల నుంచి పలు సమస్యలపై వినతులు స్వీకరించారు.అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అంబళ్ల అప్పలనాయుడు, చనమల్లు వెంకటరమణ, కరుమజ్జి గోవిందరావు, యడ్ల గోవిందరావు, గదల అచ్చింనాయుడు, పతివాడ గోవిందరావు, బీజేపీ నాయకుడు గోవిందరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 11:53 PM