డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు కృషి
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:03 AM
: విద్యార్ధులు, యువత డ్రగ్స్ రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా పెట్టుకోవాలని చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోలీసులు చేపట్టిన అభ్యుదయ సైకిల్ యాత్ర గురువారం రేగిడి మండలం సంకిలి మీదుగా సాగింది.
రేగిడి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): విద్యార్ధులు, యువత డ్రగ్స్ రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా పెట్టుకోవాలని చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోలీసులు చేపట్టిన అభ్యుదయ సైకిల్ యాత్ర గురువారం రేగిడి మండలం సంకిలి మీదుగా సాగింది. స్ద్ధానిక హైస్కూల్, ఉంగరాడ గురుకులంలో డీఎస్పీ రాఘవులు, రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర, ఎస్‌ఐ బాలకృష్ణల ఆధ్వర్యంంలో వందలాది మంది విద్యార్థులు, పొలీసులు, ఉపాధ్యాయులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సంకిలి హైస్కూల్, ఉంగరాడ గురుకులంలో విద్యార్థులతో డీఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉంగరాడ గురుకుల సిబ్బంది, రేగిడి, సంకిలి హైస్కూల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
బానిసలు కావద్దు
రాజాం రూరల్, డిసెంబరు 11 (ఆంధ్ర జ్యోతి): యువత మత్తు పదార్ధాలకు బానిసలై జీవితాలను అంధకారం చేసుకోవద్దని చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు సూ చించారు. పా యకరావుపేట నుంచి కొనసాగుతున్న అభ్యుదయం సైకిల్ ర్యాలీకి పట్టణ పరిధిలోని జి.ఎం.ఆర్.ఐటి. మెయిన్ గేటు వద్ద డీఎస్పీ రాఘవులు, రాజాం రూరల్ సి.ఐ. ఉపేంద్రరావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మత్తు పదార్ధాల వల్ల కలిగే అనర్ధాలను డీఎస్పీ వివరించారు. జి.ఎం.ఆర్.ఐటి. నుంచి శ్రీకాకుళం రోడ్డు వరకూ డీఎస్పీ, సి.ఐ.లు ర్యాలీలో పాల్గొన్నారు.