ఆజాద్ ఆశయ సాధనకు కృషి
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:52 PM
మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.
- జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి
పార్వతీపురం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆజాద్ జయంతిని నిర్వహించారు. ఆజాద్ చిత్రపటానికి జేసీ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆజాద్ స్వాతంత్య్ర సమరయో ధులని, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారని అన్నారు. ఆ కాలంలోనే విద్య కోసం ఉన్నతమైన ఆలోచనలు చేశారని, విద్యారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఐఐటీ, విద్య, అకాడమీ ఏర్పాటు వంటి నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖాధికారి షరీఫ్, జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీంహుస్సేన్, ఉపాధ్యక్షుడు షరీఫ్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.