Share News

Goal Achievement లక్ష్య సాధనకు కృషి

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:39 PM

Striving for Goal Achievement సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి విద్యార్థులు విద్యతో పాటు లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని ఆర్‌జేడీ విజయభాస్కర్‌ సూచించారు. మంగళవారం భామినిలో ఆదర్శపాఠశాల, కేజీబీవీని సందర్శించారు. వాటి నిర్వహణపై ఆరా తీశారు.

  Goal Achievement లక్ష్య సాధనకు కృషి
కేజీబీవీ విద్యార్థినులతో మాట్లాడుతున్న ఆర్‌జేడీ

భామిని, నవంబరు 25 ఆంధ్రజ్యోతి): సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి విద్యార్థులు విద్యతో పాటు లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని ఆర్‌జేడీ విజయభాస్కర్‌ సూచించారు. మంగళవారం భామినిలో ఆదర్శపాఠశాల, కేజీబీవీని సందర్శించారు. వాటి నిర్వహణపై ఆరా తీశారు. విద్యార్థు లతో కాసేపు మాట్లాడారు. పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనం, పాఠశాల పరిసరాలు, టాయిలెట్లను పరిశీ లించారు. వచ్చే నెల 6న మెగా పేరెంట్స్‌ టీచర్‌ మీటింగ్‌ నిర్వహించాలని, ఇందుకోసం పాఠశా లల క్రీడా మైదానాలను సిద్ధం చేయాలని సూచించారు. ఆయన వెంట డీఈవో రాజ్‌కుమార్‌, డిప్యూటీ డీఈవో టి.కృష్ణమూర్తి, ఎంఈవోలు , పాఠశాల ప్రిన్సిపాళ్లు, హెచ్‌ఎంలు ఉన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 11:39 PM