Share News

Child Marriages బాల్య వివాహాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు

ABN , Publish Date - May 28 , 2025 | 12:04 AM

Stringent Measures to Curb Child Marriages జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మహిళా శిశు సంక్షేమశాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షించారు.

  Child Marriages  బాల్య వివాహాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

పార్వతీపురం, మే 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మహిళా శిశు సంక్షేమశాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్లలను చదివించి.. వారి హక్కులను కాపాడాలన్నారు. బాల్య వివాహాలతో జరిగే అనర్థాలను తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన వన్‌స్టాప్‌ సెంటర్లపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. ‘ధరి ఆబా జన జాతీయ గ్రామ్‌ ఉత్కర్ష్‌ అభియాన్‌’పై జూన్‌ 15 నుంచి 30 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేయడానికి కృషి చేస్తుందని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టను న్నట్లు స్పష్టం చేశారు. పౌష్టికాహారం అందించే పునరావాస కేంద్రాలకు ప్రతిపాదనలు పంపించా లని కలెక్టర్‌ ఆదేశించారు. కేంద్రం అవసరాలను గుర్తించి పక్కాగా ప్రతిపాదనలు అందించా లన్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాల్లో పంపిణీ చేయనున్న పాలపొడి ప్యాకెట్లను విడుదల చేశారు. బాల్య వివాహాల నివారణ, వన్‌స్టాప్‌ సెంటర్లు తదితర అంశాలపై పోస్టర్లను ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ టి.కనకదుర్గ, డీఆర్వో కె.హేమలత, డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి, డీపీవో కొండలరావు , మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు పాల్గొన్నారు.

- అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గ్రామస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. జిల్లా, మండల అధికారులతో మాట్లాడుతూ..‘ ఇప్పటివరకు 216 మంది మాస్టర్‌ ట్రైనర్ల శిక్షణ జరిగింది. 3,550 మంది నమోదు చేసుకుని శిక్షణ పొందుతున్నారు. జూన్‌ 21 నాటికి ప్రతిఒక్కరూ యోగాపై అవగాహన కలిగి, సాధన చేసే విధంగా ఉండాలి. ప్రతి గ్రామంలో యోగా పోటీలు నిర్వహించాలి.’ అని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ శోభిక, డీఎంహెచ్‌వో భాస్కరరావు, ఎన్‌సీడీ ప్రోగాం అధికారి జగన్‌, పబ్లిక్‌ కన్సల్టెంట్‌ రఘు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - May 28 , 2025 | 12:04 AM