Strict measures for ration distribution రేషన్ పంపిణీకి పటిష్ఠ చర్యలు
ABN , Publish Date - Jun 01 , 2025 | 11:40 PM
Strict measures for ration distribution రేషన్ సరఫరా వ్యవస్థను పటిష్ఠ పరిచేందుకే రేషన్ డిపోలను మళ్లీ ప్రారంభిస్తున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఆదివారం మండలంలో గిట్టుపల్లి, కనిమెరక, కిండాం అగ్రహారం గ్రామాల్లో నిత్యావసర సరుకుల పంపిణీని ఆయన ప్రారంభించారు.
రేషన్ పంపిణీకి పటిష్ఠ చర్యలు
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
బొండపల్లి, జూన్ 1(ఆంధ్రజ్యోతి): రేషన్ సరఫరా వ్యవస్థను పటిష్ఠ పరిచేందుకే రేషన్ డిపోలను మళ్లీ ప్రారంభిస్తున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఆదివారం మండలంలో గిట్టుపల్లి, కనిమెరక, కిండాం అగ్రహారం గ్రామాల్లో నిత్యావసర సరుకుల పంపిణీని ఆయన ప్రారంభించారు. ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు ప్రతీ డిపోలో ఉదయం 8గంటల నుంచి 12, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు పంపిణీ చేస్తారన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటివద్దే రేషన్ సరుకులు అందిస్తారని, ఎటువంటి అక్రమాలకు తావుండదని, మొబైల్ పోర్టబులిటీ ద్వారా ఎక్కడైనా సరుకులు పొందవచ్చునని తెలిపారు. ప్రతీ దుకాణం వద్ద ధరలపట్టిక, సరుకుల నిల్వ సమాచారం విధిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యాశాఖ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ స్పందిస్తూ అనుభవిజ్ఞులై ఉండి విద్యావ్యవస్థపై బురదజల్లేలా మాట్లాడడం విచారకరమన్నారు. గత ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసిందని, యువ నాయకుడు నారా లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ఉన్నతంగా తీర్చిదిద్దే చర్యలు అమలవుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పీవీవీ.గోపాలరాజు, డీఎస్‌వో పి.మధుసూదనరావు, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీవో తులసీరావు తదితరులు పాల్గొన్నారు.