P-4 Gram Sabhas పక్కాగా పీ-4 గ్రామ సభలు
ABN , Publish Date - Jul 16 , 2025 | 11:56 PM
Strict Implementation of P-4 Gram Sabhas ప్రజల మధ్యలో పక్కాగా పీ-4 గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు.
పార్వతీపురం, జూలై 16(ఆంధ్రజ్యోతి): ప్రజల మధ్యలో పక్కాగా పీ-4 గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. బంగారు కుటుంబాలుగా ఎంపికైన వారి జాబితాలను ఆయా గ్రామ సచివాలయ, మండల స్థాయిలో ప్రదర్శించాలన్నారు. గ్రామసభలను నిర్వహించి ఆ జాబితాలపై అభ్యంతరాలు స్వీకరించాలని సూచించారు. ప్రతి గ్రామంలో పారిశుధ్య మెరుగు పనులు చేపట్టాలన్నారు. ఈ శనివారం జిల్లావ్యాప్తంగా ‘ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంద ’ నిర్వహించాల్సి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల వారు పాల్గొనేలా చూడాలన్నారు. తొలుత ప్రణాళిక శాఖ కన్సల్టెంట్ అమిత్‌గుప్తా.. పీ-4పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో శ్రీవాత్సవ, ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.