సరస్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:58 PM
ఈ నెల 28న ప్రారంభం కానున్న అఖిల భారత డ్వాక్రా బజార్ (సరస్-2025)కి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
వినూత్నంగా పుష్పప్రదర్శన
కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ఆదేశాలు
విజయనగరం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 28న ప్రారంభం కానున్న అఖిల భారత డ్వాక్రా బజార్ (సరస్-2025)కి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సరస్, ఫలపుష్ప ప్రదర్శన కోసం మాన్సాస్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. సందర్శకులు ఇబ్బంది పడకుండా చూడాలని, ముఖ్యంగా వాహనాల పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. డ్వాక్రా సంఘాలు ఉత్పత్తి చేసిన వస్తువుల ప్రదర్శనలు, అమ్మకాలు సజావుగా జరగాలన్నారు. డీఆర్‌డీఏ ఏపీడీ సావిత్రి, నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య, ఎలక్ర్టికల్ ఎస్‌ఈ లక్ష్మణరావు, డీఎంహెచ్‌వో జీవనరాణి, ఉద్యానవన శాఖ జేడీ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.