Share News

Negligence నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:21 AM

Strict Action for Negligence గ్రామాల్లో పారిశుధ్యం, పార్క్‌ల నిర్వహణపై పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం నర్సిపురంలో పర్యటించారు. పార్క్‌లో పరిస్థితిని చూసి అసహనం వ్యక్తం చేశారు.

  Negligence నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
నర్సిపురం పార్క్‌లో పారిశుధ్య లోపంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్‌

పార్వతీపురం రూరల్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పారిశుధ్యం, పార్క్‌ల నిర్వహణపై పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం నర్సిపురంలో పర్యటించారు. పార్క్‌లో పరిస్థితిని చూసి అసహనం వ్యక్తం చేశారు. బెంచీలు విరిగిపోయి ఉండగా.. ప్లాస్టిక్‌ సీసాలను చూసి మండిపడ్డారు. పార్క్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రజలు ప్రశాంతమైన వాతా వరణంలో ఆనందంగా గడిపేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో సత్యంను ఆదేశించారు. గ్రామ పరిశుభ్రతపై సర్పంచ్‌ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

- బెలగాం: పార్వతీపురం పట్టణంలోని పార్కులను మరింత అందంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ ఆదేశించారు. గురువారం చర్చివీధిలోని పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ వాసులకు పచ్చని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా పార్కులను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. మొక్కలు పెంపకానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. పార్కులో వాకింగ్‌ ట్రాక్‌, బెంచీలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు ఉండాలని, పిల్లలకు ఆట వస్తువులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ వైశాలి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 12:21 AM