Share News

వీధి విక్రయదారులను గుర్తించాలి

ABN , Publish Date - May 14 , 2025 | 12:27 AM

పురపాలక సంఘం పరిధిలో గల వీధి విక్రయ దారులను గుర్తించాలని బొబ్బిలి మునిసిపల్‌ కమిషనర్‌ రామలక్ష్మి కోరారు. వారిని వెండర్స్‌ కనెక్ట్‌ యాప్‌లో వెల్ఫేర్‌, ప్లానింగ్‌ సెక్రటరీల ద్వారా సర్వేచేసి డేటాను వెల్ఫేర్‌ సెక్రటరీ లాగిన్‌ ద్వారా వెరిఫై చేసి కమిషనర్‌ లాగిన్‌కు అప్లోడ్‌ చేయాలని సూచించారు.

వీధి విక్రయదారులను గుర్తించాలి
మాట్లాడుతున్న రామలక్ష్మి:

బొబ్బిలి రూరల్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): పురపాలక సంఘం పరిధిలో గల వీధి విక్రయ దారులను గుర్తించాలని బొబ్బిలి మునిసిపల్‌ కమిషనర్‌ రామలక్ష్మి కోరారు. వారిని వెండర్స్‌ కనెక్ట్‌ యాప్‌లో వెల్ఫేర్‌, ప్లానింగ్‌ సెక్రటరీల ద్వారా సర్వేచేసి డేటాను వెల్ఫేర్‌ సెక్రటరీ లాగిన్‌ ద్వారా వెరిఫై చేసి కమిషనర్‌ లాగిన్‌కు అప్లోడ్‌ చేయాలని సూచించారు. మంగళవారం మునిసి పల్‌ కార్యాలయంలో కమిషనర్‌ అధ్యక్షతన వార్డు సెక్రటరీలు, మెప్మా సిబ్బంది, ఆర్పీతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ప్రస్తుతం ఉన్న వీధి, స్వానిధి విక్రయదారులు, కొత్తగా నమోదు కావలిసిన వీధి విక్రయదారులను మూడు కేటగిరీలుగా నమోదు చేయాలన్నారు. ఈ నమోదు ప్రక్రియ ఈ నెల 17లోగా శతశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో టీపీఆర్‌వో జగన్మోహనరావు, టీపీపఎస్‌ ఫిలిఫ్‌, మెప్మా సిబ్బంది, ఆర్పీలు, వార్డు పెల్ఫేర్‌ సెక్రటరీలు, ప్లానింగ్‌ సెక్రటరీలు పాల్గొన్నారు.

డస్ట్‌బిన్లు ఏర్పాటు చేసుకోవాలి

మార్కెట్‌లో చెత్తను రోడ్లపై వేయకుండా డస్ట్‌బిన్లను ఏర్పాటు చేసుకోవాలని బొబ్బిలి మునిసిపల్‌ కమిషనర్‌ రామలక్ష్మి కోరారు. మంగళవారం పట్టణంలో పలుచోట్ల పర్య టించారు. బలిజిపేట రోడ్డులో ఖాళీ స్థలంలో ఉన్న చెత్తను ఏరివేయించాలని, గార్బేజ్‌ పాయింట్లను క్లియర్‌ చేయించాలని సిబ్బందికి ఆదేశించారు. అగురువీధిలో మునిసిపల్‌ బావి గట్టు తొలగించి ప్రమాదకరస్థితిలో ఉన్నట్లుగా గుర్తించారు. ఆ బావి గట్టు తిరిగి నిర్మించాలని అక్కడ ఉన్న ఇంటి యజమానికి తెలియజేశారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, ఏఈ, పర్యావరణ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2025 | 12:27 AM