Share News

నిలిచిన యూరియా పంపిణీ

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:05 AM

కొండగూడెం గ్రామంలోని సచివాలయం వద్ద మంగళవారం చేపట్టాల్సిన యూరియా పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది.

నిలిచిన యూరియా పంపిణీ

  • సరిపడినంత రాలేదని ఆందోళన

సంతకవిటి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): కొండగూడెం గ్రామంలోని సచివాలయం వద్ద మంగళవారం చేపట్టాల్సిన యూరియా పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. అ సచివాలయానికి 210 బస్తాల యూరియా వచ్చింది. పంపిణీ సక్రమంగా నిర్వహించే నిమిత్తం ఏవో యశ్వంత్‌రావుతో పాటు పోలీసులు మంగళవారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ సచివాలయ పరిధిలో సుమారు 400 మంది రైతులు ఉన్నారు. దీంతో ఒకొక్కరికి ఒక్క బస్తా కూడా అందదని గ్రహించిన రైతులు.. ఇంకో లోడు వచ్చినంతవరకు పంపిణీ వాయిదా వేయాలని ఏవోను కోరారు. దీనిపై ఏవో మాట్లాడుతూ.. కొండగూడెం సచివాలయానికి ఇదివరకే 10 టన్నుల యూరియా పంపిణీ చేశామని, ఇప్పుడు వచ్చిన 10 టన్నులు కూడా పంపిణీ చేసి, మళ్లీ ఇండెంట్‌ పెట్టి అందరి రైతులకు యూరియా అందేలా చేస్తామని తెలిపారు. కానీ రైతులు అంగీకరించకపోవడంతో పంపిణీ నిలిపివేశారు.

Updated Date - Sep 10 , 2025 | 12:05 AM