Share News

కాంగ్రెస్‌ బలోపేతానికి చర్యలు

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:16 AM

ఏపీలో రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఏఐసీసీ పరి శీలకుడు, ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే దేబాషిస్‌ పట్నాయక్‌ తెలిపారు. గురువారం పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాల్లో పర్యటించి బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజలసమస్యలు పరిష్క రించడంలో విఫలమయ్యిందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ బలోపేతానికి చర్యలు
మాట్లాడుతున్న దేబాషిస్‌ పట్నాయక్‌:

బెలగాం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ఏపీలో రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఏఐసీసీ పరి శీలకుడు, ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే దేబాషిస్‌ పట్నాయక్‌ తెలిపారు. గురువారం పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాల్లో పర్యటించి బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజలసమస్యలు పరిష్క రించడంలో విఫలమయ్యిందని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు జగత శ్రీనివాసరావు, డీసీసీ నాయకుడు బుల్లిబాబు, నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తిన మోహన్‌రావు, నాయకులు దాలినాయుడు, కోలా కిరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 12:16 AM