అంధుల పాఠశాలలో సమస్యల పరిష్కారానికి చర్యలు: అదితి
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:58 PM
అంధుల పాఠశాలలో సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపా రు. గురువారం విజయ నగ రంలోని పూల్‌బాగ్ కాలనీ మంగళవీధిలోని ప్రభుత్వ అంధుల పాఠశాలను పరిశీ లించి, సదుపాయాలు, సమ స్యలను అడిగి తెలుసుకున్నా రు.
విజయనగరం రూరల్, నవంబరు 20 (ఆంధ్రజ్యో తి): అంధుల పాఠశాలలో సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపా రు. గురువారం విజయ నగ రంలోని పూల్‌బాగ్ కాలనీ మంగళవీధిలోని ప్రభుత్వ అంధుల పాఠశాలను పరిశీ లించి, సదుపాయాలు, సమ స్యలను అడిగి తెలుసుకున్నా రు. పాఠశాలలోని సమస్యల పరిష్కారం కోసం ఇంజనీ రింగ్ అధికారులతో చర్చించారు.అలాగే రాష్ట్ర ఎస్సీకమిషన్ చైర్మన్ కేఎస్ జవహార్‌ను అదితిగజపతిరాజు గురువారం జడ్పీ అతిథిగృహంలో కలిశారు. నియోజకవర్గంలోని ఎస్సీలు, ఎస్సీ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ఆయనకు వివరించారు.