గంజాయి నిరోధానికి చర్యలు: డీఎస్పీ
ABN , Publish Date - Jul 12 , 2025 | 11:59 PM
గంజాయి అక్రమ రవాణా నిరో ధానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం మండలంలోని ఎనుబరువు సమీపంలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్ హైవేపై తనిఖీలు నిర్వహించారు.
రామభద్రపురం, జూలై 12(ఆంధ్రజ్యోతి): గంజాయి అక్రమ రవాణా నిరో ధానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం మండలంలోని ఎనుబరువు సమీపంలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్ హైవేపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒడిశా నుంచి ఎక్కువగా గంజాయి అక్రమరవాణా జరుగుతున్న దృష్ట్యా గ్రీన్‌పీల్డ్ హైవే వద్ద చెక్‌పోస్టు ఏర్పాటుచేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే కొట్టిక్కి చెక్‌పోస్టు వద్ద 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రధానంగా మాదకద్రవ్యాల నిరోధానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసు కుంటోందని, ఇందులో భాగంగా గంజాయి నిల్వ ఉంచినా, రవాణా చేసినా వారిపై కఠిన మైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు, ఎస్‌ఐ వెలమల ప్రసాద్ పాల్గొన్నారు.