Share News

Water Supply సాగునీరు అందించేలా చర్యలు

ABN , Publish Date - May 29 , 2025 | 11:31 PM

Steps to Ensure Irrigation Water Supply తోటపల్లి కాలువల ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని పాలకొండ సబ్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తోటపల్లి కాలువలు, రైతుల సమస్యలపై గురువారం తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.

 Water Supply సాగునీరు అందించేలా చర్యలు
సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న రైతు సంఘం నాయకులు

పాలకొండ, మే 29 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి కాలువల ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని పాలకొండ సబ్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తోటపల్లి కాలువలు, రైతుల సమస్యలపై గురువారం తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ‘తోటపల్లి బ్యారేజ్‌ వద్ద పాత కుడి, ఎడమ కాలువలకు షట్టర్లు సరిగా పనిచేయడం లేదు. దీని వల్ల నీటి ప్రవాహాన్ని నియంత్రించలేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.’ అని రైతు సంఘం నాయకులు తెలిపారు. దీనిపై జల వనరులశాఖ డీఈఈ గనిరాజు మాట్లాడుతూ.. రూ.16 లక్షలతో షట్టర్లు ఏర్పాట్లుకు సాంకేతికపరమైన అనుమతులు వచ్చాయన్నారు. టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి ఖరీఫ్‌ సీజన్‌లో సాగునీరు విడుదల చేసే నాటికి సమస్య పరిష్కరిస్తాని వెల్లడించారు. కాలువల్లో పూడికలు, తుప్పలు, డొంకలను తొలగించాలని రైతు సంఘం నాయకులు కోరారు. ప్రస్తుత కాలువపై ఉన్న కట్టడాలు కూలిపోయి ఉన్న కారణంగా శివారు వరకు సాగునీరు ఇచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని సబ్‌ కలెక్టర్‌ హామీ ఇచ్చారు. తోటపలి కడి, ఎడమ కాలువల పరిధిలో 31 మంది లస్కర్ల అవసరం ఉందని తోటపల్లి కాలువల సాధన సమితి కార్యదర్శి బుడితి అప్పలనాయుడు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తానని సబ్‌ కలెక్టర్‌ తెలిపారు. పాలకొండ బ్యారేజ్‌ పాలకొండ డివిజన్‌ వారితో, తోటపల్లి ప్రాజెక్టు కమిటీ వారితో సమావేశం ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. జూన్‌ 4న సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌ డీఈఈ గనిరాజును సబ్‌ కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, సోంబాబు, బాబు, అప్పలనాయుడు, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:31 PM