Waterfalls జలపాతాల అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Oct 17 , 2025 | 12:15 AM
Steps for the Development of Waterfalls పర్యాటకులను ఆకట్టుకునేలా జిల్లాలో జలపాతాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. గురువారం తాడికొండ జలపాతం వద్ద గిరిజనులు ఏర్పాటు చేసిన దుకాణ సము దాయాలు, ఇతర వసతులను ప్రారంభించారు.
గుమ్మలక్ష్మీపురం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): పర్యాటకులను ఆకట్టుకునేలా జిల్లాలో జలపాతాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. గురువారం తాడికొండ జలపాతం వద్ద గిరిజనులు ఏర్పాటు చేసిన దుకాణ సము దాయాలు, ఇతర వసతులను ప్రారంభించారు. ముందుగా వారు ఆ ప్రాంతంలో ఉన్న వన దేవతకు పూజలు చేశారు. పర్యాటకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కాఫీ అండ్ పాస్ట్ ఫుడ్ షాప్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత జలపాతం, ప్రకృతి రమణీయ దృశ్యాలను వీక్షించారు. పర్యాటకుల కోసం తాడికొండ నుంచి జలపాతం వరకు బైక్‌రైడర్స్‌ను ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు. త్వరలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని, జలపాతాల జిల్లాగా మన్యాన్ని తీర్చిదిద్దుదామని స్పష్టం చేశారు. అంతకుముందు వారికి స్థానిక గిరిజనులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.