Solar Power సోలార్ ఏర్పాటుకు చర్యలు
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:08 AM
Steps for Installing Solar Power Systems పీఎం సూర్య ఘర్ పథకం కింద జిల్లాలో గృహాలకు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని విద్యుత్‌శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.మల్లికార్జునరావు తెలిపారు. శనివారం పాచిపెంట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సంద ర్శించారు.
పాచిపెంట, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): పీఎం సూర్య ఘర్ పథకం కింద జిల్లాలో గృహాలకు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని విద్యుత్‌శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.మల్లికార్జునరావు తెలిపారు. శనివారం పాచిపెంట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సంద ర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ సోలార్ ఏర్పాటుకు ఇంటి పైకప్పుపై వంద చదరపు అడుగుల విశాలమైన స్థలం ఉండాలి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా పథకం వర్తిస్తుంది. జిల్లాలో 35,033 మంది ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. వీరిలో ఎస్సీలు 14,169 మంది , ఎస్టీలు 20,864 మందిని అర్హులుగా గుర్తించాం. ఇప్పటివరకు 8,312 మంది డాక్యుమెంట్లు అంద జేశారు. వీటిని మళ్లీ పరిశీలిస్తాం. బ్యాంకు అకౌంటు, ఆధార్‌కార్డు దరఖాస్తుతో జత చేయాలి. పాచిపెంట మండలంలో 5,720 మందిని లబ్ధిదారులను గుర్తించాం. జిల్లాలో ఆరు ఏఈ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.’ అని తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ డీఈఈ కె.ప్రసన్నకుమార్ తదితరులు ఉన్నారు.