Industrialization పారిశ్రామికీకరణకు చర్యలు
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:21 AM
Steps for Industrialization జిల్లాలో పారిశ్రామికీకరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మార్కెటింగ్‌తో కూడిన పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమల వ్యవస్థాపనపై వర్క్‌షాప్ నిర్వహించారు.
పార్వతీపురం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పారిశ్రామికీకరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మార్కెటింగ్‌తో కూడిన పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమల వ్యవస్థాపనపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘ ప్రతి గ్రామంలో ఐదు నుంచి 10 యూనిట్లు ఏర్పాటు చేయాలి. ప్రతి శాఖకు ఒక నోడల్ అధికారిని నియమించాలి. మహిళ సంఘాలు, యువతతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు పరిశ్రమల ఏర్పాటుపై పూర్తి అవగాహన కల్పించాలి. వారితో బ్యాంకు ఖాతాలు తెరిపించాలి. పీఎం ఉపాధి కల్పన పథకం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వారికి ఉద్యోగావకాశాలు కల్పించాల్సి ఉంది. ’ అని తెలిపారు. అంతకుముందు వివిధ ఉత్పత్తులపై ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. టీపీటీ ద్వారా పరిశ్రమల అనుమతి మంజూరు, మ్యాన్‌ఫ్యాక్చరింగ్, జనరల్ సర్వీస్ , దరఖాస్తు చేసుకునే విధానాన్ని జిల్లా పరి శ్రమలశాఖ మేనేజర్ ఎం.వి.కరుణాకర్ వివరించారు.