గుర్లలో స్టీల్‌ప్లాంట్: కిమిడి
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:55 PM
గుర్ల వద్ద ఐదు వేల కోట్లతో స్టీల్‌ప్లాంట్ రానుండడంతో నియోజకవర్గానికి పూర్వ వైభవం వస్తుందని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు.
చీపురుపల్లి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): గుర్ల వద్ద ఐదు వేల కోట్లతో స్టీల్‌ప్లాంట్ రానుండడంతో నియోజకవర్గానికి పూర్వ వైభవం వస్తుందని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు. మంగళవారం చీపురుపల్లి టీడీపీ కార్యాల యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు ఆటంకాలు కల్పించవద్దని రైతులను కోరారు. మడ్డువలస, తోటపల్లి, కొవ్వాడ భూసేకరణలో అనుసరించిన కన్సంట్ అవార్డు విధానం ద్వారా రైతులకు తక్షణ పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు వల్ల ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. సమావేశంలో టీడీపీ నాయకులు రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు, పైల బలరాం, ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్లు రేగాన రామారావు, వలిరెడ్డి శ్రీరాములునాయుడు పాల్గొన్నారు. కాగా ఆర్వోబీ వల్ల తమ కాలనీకి వెళ్లే రోడ్డు మూసుకుపోతుందని, 20 అడుగుల రహదారి సౌకర్యం తమకు కల్పించాలని రిక్షాకాలనీ, కొత్తగ్రహారం వాసులు కోరారు. కళా వెంకటరావును వారంతా పార్టీ కార్యాలయంలో కలిశారు.