జిల్లాకు స్టీల్ ప్లాంటు
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:47 AM
జిల్లాలో స్టీల్‌ప్లాంటు ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
- గుర్లలో ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు
- సీఐఐ సదస్సు విజయవంతం
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం రూరల్, నవంబరు 16 ( ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్టీల్‌ప్లాంటు ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం రాత్రి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్లలో స్టీల్‌ప్లాంటును ఏర్పాటు చేసేందుకు జిల్లా ప్రజా ప్రతి నిధులంతా ఉమ్మడిగా నిర్ణయించి, ప్రభుత్వానికి అభిప్రా యం తెలియజేశామన్నారు. స్టీల్‌ప్లాంటుతో జిల్లాలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరింతగా పెరుగుతాయ న్నారు. ముఖ్యంగా వలసలను నివారించవచ్చునన్నారు. ‘విశాఖపట్నంలో సీఐఐ సదస్సు విజయవంతంగా జరిగింది. రూ.13 లక్షల కోట్లు వరకూ పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీని ద్వారా సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన 20 లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. రాష్ట్రానికి విస్తృ తంగా పెట్టుబడులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తు న్న కృషి ప్రశంసనీయం. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఏదోఒకటి విమర్శిస్తుంటారు. సీఐఐ సదస్సు గురించి విమర్శలు తప్పకుండా చేస్తారు. ఇటువంటి వారు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. గతంలో జరిగిన సీఐఐ సదస్సుకి, ప్రస్తుతం జరిగిన సదస్సుకి తేడా గమనించాలి.’ అని మంత్రి అన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పారిశ్రామిక వేత్తలతో నిర్వహించిన సీఐఐ సదస్సు విజయవంతం అయింద న్నారు. ఇది సీఎం చంద్రబాబు ఘనతేనన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత విస్తృతంగా పెరగనున్నాయని అన్నారు. అనంతరం సీఐఐ సదస్సు విజయవంతం కావడంపై కేక్ కేట్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కర్రోతు బంగార్రాజు, కడగల ఆనందకుమార్, పి.రాజేష్‌వర్మ, మక్కువ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.