Share News

రాష్ట్రస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌

ABN , Publish Date - Nov 17 , 2025 | 12:48 AM

కొండవెలగాడలో మూడురోజులపాటు నిర్వహించిన 12వ రాష్ట్ర స్థాయి మెన్‌ అండ్‌ ఉమెన్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఆదివారం ముగిశాయి.

 రాష్ట్రస్థాయి  వెయిట్‌ లిఫ్టింగ్‌
విజేతలకు బహుమతులు అందిస్తున్న దృశ్యం

-ఓవరాల్‌ చాంపియన్‌గా విజయనగరం

-ముగిసిన పోటీలు

నెల్లిమర్ల, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): కొండవెలగాడలో మూడురోజులపాటు నిర్వహించిన 12వ రాష్ట్ర స్థాయి మెన్‌ అండ్‌ ఉమెన్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. ఉమెన్‌, మెన్‌ సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్స్‌ విభాగాల్లో ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచారు. ఉమెన్స్‌ విభాగంలో బెస్ట్‌ వెయిట్‌ లిఫ్టర్‌గా కొండవెలగాడ క్రీడాకారిణి సుస్మిత నిలిచారు. మెన్స్‌ విభాగంలో కడప జిల్లాకు చెందిన రవిశంకర్‌ బెస్టు లిఫ్టర్‌గా సత్తా చాటారు. విజేతలకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏపీ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు, వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి నీలంశెట్టి లక్ష్మి బహుమతులు అందించా రు. ఈ సందర్భంగా ఎంపీ కలిశెట్టి మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని రాణించాలని అన్నారు. త్వరలో కొండవెలగాడలోని జిమ్‌ని పరిశీలించి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ముందుగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణి సత్యజ్యోతికి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కడగల ఆనంద్‌కుమార్‌, నగర పంచాయతీ అధ్యక్షుడు లెంక అప్పలనాయుడు, నాయకులు దంతులూరి అజయ్‌బాబు, మొయిద సత్యనారాయణ, వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రతినిధులు అట్టాడ లక్ష్ముంనాయుడు, చల్లా రాము, వల్లూరు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2025 | 12:48 AM