కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి
ABN , Publish Date - Jul 06 , 2025 | 11:57 PM
కూటమి ప్రభు త్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని స్త్రీ శిశు, గిరిజన సంక్షే మ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
మంత్రి సంధ్యారాణి
కొమరాడ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభు త్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని స్త్రీ శిశు, గిరిజన సంక్షే మ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మార్కండపుట్టి గ్రామంలో ఆమె ఆదివారం పర్యటించి, ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలపై వివరించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. మంత్రి తోపాటు ప్రభుత్వ విప్ జగదీశ్వరి పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరం గ సభలో మంత్రి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్‌సిక్స్ పథకాలను అమలు చేయడ మే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తోటపల్లి నిర్వాసి తులకు ఏమైనా సమస్యలుంటే పరిష్కరిస్తామన్నారు. జంఝావతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పూర్ణపాడు, లాబేసు పనులు త్వరలోనే పూర్తవు తాయన్నారు. ఈ కార్యక్రమంలో వైరిచర్ల వీరేశ్‌దేవ్, ట్రైకార్ డైరక్టర్ లావణ్య, ఏఎంసీ చైర్మన్ కళావతి, టీడీపీ మండల అధ్యక్షుడు శేఖర్ పాత్రుడు, స్థానిక సర్పంచ్ జంజేటి నిర్మల, అరకు పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షుడు ఎంపీటీసీ దేవకోటి వెంకటనాయుడు, టీడీపీ నాయకులు మధుసూదనరావు, ఎం.తిరుపతినాయుడు, గొట్టాపు త్రినాథ తదితరులు పాల్గొన్నారు.