శానిటేషన్ ప్రక్రియ ప్రారంభించండి: కలెక్టర్
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:07 AM
గంగన్నపాడు గ్రామాన్ని కలెక్టర్ రామసుం దర్‌రెడ్డి బుధవారం సందర్శించారు. గ్రామ సమీపంలోనున్న నర్సుపల్లి చెరువు పూర్తిగా నిండడంతో మిగులు నీరంతా గ్రామంలోకి ప్రవహించడాన్ని ఆయన పరిశీలించారు. ఇరిగేషన్ ఏఈ ప్రవీణ్ కూమార్‌తో మాట్లాడి నీటి ప్రవాహం తగ్గేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అదేశించారు.
తెర్లాం, అక్టోబరు 29(అంధ్రజ్యోతి): గంగన్నపాడు గ్రామాన్ని కలెక్టర్ రామసుం దర్‌రెడ్డి బుధవారం సందర్శించారు. గ్రామ సమీపంలోనున్న నర్సుపల్లి చెరువు పూర్తిగా నిండడంతో మిగులు నీరంతా గ్రామంలోకి ప్రవహించడాన్ని ఆయన పరిశీలించారు. ఇరిగేషన్ ఏఈ ప్రవీణ్ కూమార్‌తో మాట్లాడి నీటి ప్రవాహం తగ్గేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అదేశించారు. గ్రామంలో వరద ప్రభావం తగ్గిన వెంటనే ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని, శానిటేషన్ ప్రక్రియ మొదలు పెట్టాలని అధికారులకు సూచించారు. కాగా తహసీల్దార్ హేమంత్‌కుమార్ పల్లపు ప్రాంతంలో ఉన్న నాలుగు కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బేబీనాయన బుధవారం గ్రామంలో పర్యటించి అధికారులను మరింత అప్రమత్తం చేశారు. అర్డీవో రామ్మోహనరావు కూడా గ్రామాన్ని సందర్శించారు.
ఊపిరి పీల్చుకున్న జిల్లా యంత్రాంగం
విజయనగరం కలెక్టరేట్, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): మొంఽథా తుపాన్ తీవ్రత తగ్గడంతో అధికారయంత్రాంగం ఊపిరి పీ ల్చుకుంది. ప్రాణ, ఆస్తి నష్టం నివారణకు అధికార యంత్రాంగం చేసిన కృషి ఫలిచింది. మంగళవారం అర్ధరాత్రి కలెక్టరు రామసుందర్‌రెడ్డి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో ఉండి ఎప్పటి కప్పుడు పరిస్థితిని పరిశీలించారు. కింద స్థాయి అధికారులను ఎప్పటికప్పుడు అప్ర మత్తం చేశారు. జేసీ సేతుమాధవన్ డెం కాడలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూము తనిఖీ చేశారు. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా అధికారులను ఎప్పటిక ప్పుడు అప్రమత్తం చేశారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా తేలిక పాటి వర్షం కురి సింది. మొత్తం జిల్లాలోని రెవెన్యూ, పోలీ సు, విద్యుత్, వ్యవసాయ, పంచాయతీరాజ్, మునిసిపల్, వైద్య, విద్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటించా రు. మూడురోజులపాటు సుమారు జిల్లా వ్యాప్తంగా 116.1 మిల్లీమీటర్లు వర్షం కురి సింది.చెరువులు నిండ కుండల్లా మారా యి. జిల్లాలో గోస్తాని, చంపావతి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. తాటిపూడి, ఆం డ్ర, మడ్డువలస రిజర్వాయర్లలోకి వరద నీరు చేరడంతో ముందుగానే ఇరిగేషన్ అధికారులు కిందకు విడిచి పె ట్టారు.కాగా తుఫాన్ సమయంలో నిర్విరా మంగా కృషి చేసి ప్రాణనష్టం జరగకుం డా సేవలం దించినందుకు సమయ స్పూర్తితో వ్యవ హరించిన కలెక్టరు రామసుందర్‌రెడ్డిని సీఎం అభినందించారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం, ప్రజలకు తక్షణ సహా యం అందించేలా చర్యలు తీసు కోవడం తోపాటు సమష్టి కృషి వల్ల ఉత్తమ ఫలితా లు సాధించారని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయి లో సమర్ధవంతంగా జిల్లా అధికారు లు, సచివాలయం సిబ్బంది పని చేశారని, వారి సేవలను అమోఘమని కలెక్టరు రామ సుందర్ రెడ్డి అభినందించారు.