Share News

Verification of Certificates ధ్రువపత్రాల పరిశీలనకు రంగం సిద్ధం

ABN , Publish Date - Aug 26 , 2025 | 11:29 PM

Stage Set for Verification of Certificates మెగా డీఎస్సీ మెరిట్‌ లిస్ట్‌లో ఉన్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన గురువారం నుంచి జరగనుంది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 28 ఉదయం తొమ్మిది గంటల నుంచి డెంకాడ పరిధి 26వ హైవే పక్కన ఉన్న మోదవలస ఓయోస్టార్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 12 బృందాలు ధ్రువపత్రాలను పరిశీలించనున్నాయి.

 Verification of Certificates  ధ్రువపత్రాల పరిశీలనకు రంగం సిద్ధం

మోదవలసలో ఏర్పాట్లు

సాలూరు రూరల్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ మెరిట్‌ లిస్ట్‌లో ఉన్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన గురువారం నుంచి జరగనుంది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 28 ఉదయం తొమ్మిది గంటల నుంచి డెంకాడ పరిధి 26వ హైవే పక్కన ఉన్న మోదవలస ఓయోస్టార్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 12 బృందాలు ధ్రువపత్రాలను పరిశీలించనున్నాయి. ఈ ప్రక్రియను ఉన్నతాధికారులు సైతం పర్యవేక్షించ నున్నారు. ఇప్పటికే రిజర్వేషన్‌, నియమ నిబంధనల ఆధారంగా కటాఫ్‌ మార్కులు నిర్ణయించి అభ్యర్థులకు వ్యక్తిగత లాగిన్‌కు కాల్‌ లెటర్లు పంపారు. ధ్రువపత్రాల పరిశీలన కోసం వెళ్లేవారు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాగా మెగా డీఎస్సీకి దరఖాస్తు సమయంలో సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో అప్లోడ్‌ చేయని వారు ప్రస్తుతం ఆ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. అప్పుడు అప్లోడ్‌ చేసిన వారు ఇప్పుడు కేవలం ఆధార్‌ కార్డు మాత్రమే పొందుపరచాల్సి ఉంటుంది. కాగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తంగా 583 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి తీసుకెళ్లాలి...

మెగా డీఎస్సీ ధ్రువపత్రాల పరిశీలనకు వెళ్లే అభ్యర్థులు తమ ఒరిజినల్‌ ధ్రువపత్రాలను తీసుకెళ్లాలి. కేటాయించిన తేదీ, సమయానికి తప్పకుండా వెళ్లాలి. విద్యాసంబంధిత పత్రాలు, డీఎస్సీ హాల్‌ టికెట్‌, టెట్‌ మార్కుల కాపీ, ఇటీవల జారీ చేసిన కులధ్రువీకరణ ( వర్తించిన వారికి), వైకల్యం ధ్రువీకరణ ( వర్తించిన వారికి ), కాల్‌ లెటర్‌లో సూచించినపత్రాలు, గెజిటెడ్‌ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్లు కాపీలు, ఐదు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో హాజరవ్వాలి. ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. అనంతరం ఎంపికైన కొత్త ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నారు. వచ్చే నెల వారు ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో విధుల్లో చేరే అవకాశముంది. డీఎస్సీలో కొంత మంది అభ్యర్థులు మూడేసి పోస్టులకు సైతం మెరిట్‌ లిస్ట్‌లో టాపర్లుగా ఉన్నారు. అటువంటి వారు దరఖాస్తు సమయంలో ఇచ్చిన తొలి ఆప్షన్‌ పోస్టునే కేటాయించే అవకాశాలున్నాయని తెలిసింది.

Updated Date - Aug 26 , 2025 | 11:29 PM