Share News

New Ration Cards నూతన రేషన్‌ కార్డులకు రంగం సిద్ధం

ABN , Publish Date - May 06 , 2025 | 11:06 PM

Stage Set for New Ration Cards నూతన రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేటి నుంచి కొత్త కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. సభ్యుల చేరిక, స్ల్పిట్‌, చిరుమా మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది.

New Ration Cards నూతన రేషన్‌ కార్డులకు రంగం సిద్ధం

చేర్పులు, మార్పులకు అవకాశం

పార్వతీపురం, మే6(ఆంధ్రజ్యోతి): నూతన రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేటి నుంచి కొత్త కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. సభ్యుల చేరిక, స్ల్పిట్‌, చిరుమా మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. నెల రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఉంటుందని వెల్లడించింది. జిల్లాలో ప్రస్తుతం 2,81,251 వరకు రేషన్‌ కార్డులున్నాయి. వాటిల్లో 55,939 ఏఏవై కార్డులు ఉన్నాయి. అదేవిధంగా 2,25,312 డబ్ల్యూఏపీ రైస్‌ కార్డులున్నాయి. కాగా ‘మన్యం’లో ఇప్పటికే సుమారు ఐదు వేల మందికి పైబడి కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్త కార్డుల జారీ ప్రక్రియ జరగలేదు. దీంతో ఐదేళ్ల నుంచి ఎంతోమంది దరఖాస్తులు చేసుకుని వాటి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం నూతన రేషన్‌కార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించడంతో ‘మన్యం’ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభిస్తామని జిల్లా సివిల్‌ సప్లైస్‌ అధికారి రాజేశ్వరి తెలిపారు. ఈకేవైసీ కార్యక్రమం 93 శాతం పూర్తయిందన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:06 PM