Share News

సిబ్బంది అందుబాటులో ఉండాలి

ABN , Publish Date - Sep 25 , 2025 | 12:00 AM

సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి కోరారు. బుధవారం జిల్లాలోని పలు సచివాలయాలు, రెవెన్యూ, మండలపరిషత్‌ కార్యాలయాలను పరిశీలించి రికార్డులు తనిఖీచేశారు. బాధ్యతలు స్వీకరించిన తొలిసారి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుతున్నసేవలపై ఆరాతీశారు.

 సిబ్బంది అందుబాటులో ఉండాలి
గరివిడి: పంచాయతీ సిబ్బందితో మాట్లాడుతున్న రామసుందర్‌రెడ్డి :

సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి కోరారు. బుధవారం జిల్లాలోని పలు సచివాలయాలు, రెవెన్యూ, మండలపరిషత్‌ కార్యాలయాలను పరిశీలించి రికార్డులు తనిఖీచేశారు. బాధ్యతలు స్వీకరించిన తొలిసారి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుతున్నసేవలపై ఆరాతీశారు.

అధికారులు సమన్వయంతో ముందుకుసాగాలి

చీపురుపల్లి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమం దిశగా ప్రతి విభాగం సమన్వయంతో ముందుకు సాగాలని కలెక్టర్‌ ఎస్‌. రామసుం దర్‌రెడ్డి ఆదేశించారు.చీపురుపల్లి ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాలను సంద ర్శించి, అక్కడి అధికారులతో ప్రస్తుత పరిస్ధితులపై సమీక్షించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో వ్యవసాయానికి అవసరమైన సహకారం అందజేయాలన్నారు. రైతులకు ఎరువుల సరఫరా సజావుగా జరిగేలా చూడాలన్నారు. తొలుత ఆయన గరివిడి పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి, అధికారులు, సిబ్బంతో మాట్లాడారు. ఆయన వెంట ఆర్డీవో బి. ఆశయ్య, డీఎల్‌డీవో హేమసుందర్‌, డీఎస్పీ బి.రాఘవులు, సీఐ జి. శంకరరా వు, ఎంపీడీవో ఐ.సురేష్‌, తహసీల్దారు డి. ధర్మరాజు పాల్గొన్నారు.

ఫగరివిడి,సెప్టెంబరు24(ఆంధ్రజ్యోతి):గరివిడిలోనికొండపాలెం సచివా లయ కార్యాలయంలో రికార్డులను కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో గరివిడి తహసీల్దార్‌ బంగారు రాజు, ఇన్‌చార్జి ఎంపీడీవో మఽధు, పంచాయతీ ఈవో నాగమణి, సర్పంచ్‌ ప్రమీల కుమారి పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 12:00 AM