సిబ్బంది అందుబాటులో ఉండాలి
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:12 AM
సచివాలయ సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్క రించాలని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సూచించారు.
పాలకొండ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): సచివాలయ సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్క రించాలని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సూచించారు. సోమవారం మండలంలోని చిన్నమంగళాపురం గ్రామ సచివాల యాన్ని తనిఖీచేసి, రికార్డులు పరిశీలించారు.ఈ సందర్భంగా మా ట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు జాడ శ్రీధర్, వైస్ ఎంపీపీ వి.అనీల్‌కుమార్, సుధాకర్ పాల్గొన్నారు. అలాగే అవలంగికి చెందిన టీడీపీ నాయ కుడు ముంజేటి గోవిందనాయుడు కుమారుడు రమేష్ మరణిం చడంతో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పరామరించారు. అలాగే చిన్న మంగళాపురానికి చెందిన కిమిడి కాశింనాయుడు సోదరుడు సూ రపునాయుడు మృతిచెందడంతో, బెజ్జిలో వావిలపల్లి శంకరరావు మృతిచెం దడంతో ఆయా కుటుంబాలను పరామర్శించారు.