రాజాంలో శ్రీలీల సందడి
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:44 PM
రాజాంలో ప్రముఖ సినీనటి శ్రీలీల ఆదివారం సందడి చేసింది. ప్రముఖ వస్త్ర, బంగారు ఆభరణాల సంస్థ సీఎంఆర్ షాపిం గ్‌మాల్ 44వ బ్రాంచ్‌ను రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ప్రారంభించగా, శ్రీలీల జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం మాల్ అధినేత మావూరు వెంకటరమణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాజాం రావడంతనకెంతో సంతోషంగా ఉందన్నారు.
రాజాం/రూరల్, డిసెంబరు 14 (ఆంఽధ్ర జ్యోతి): రాజాంలో ప్రముఖ సినీనటి శ్రీలీల ఆదివారం సందడి చేసింది. ప్రముఖ వస్త్ర, బంగారు ఆభరణాల సంస్థ సీఎంఆర్ షాపిం గ్‌మాల్ 44వ బ్రాంచ్‌ను రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ప్రారంభించగా, శ్రీలీల జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం మాల్ అధినేత మావూరు వెంకటరమణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాజాం రావడంతనకెంతో సంతోషంగా ఉందన్నారు.ప్రస్తుతం పలుచిత్రాల్లో నటిస్తున్నానని చెప్పారు.సీఎంఆర్ అధినేత మావూరు వెంకటరమణ మాట్లాడుతూ షోరూములో తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలు అందజేస్తామన్నారు.వస్త్రాలపై డిస్కౌంట్‌తో పాటు ప్రత్యేక ఆఫర్లు కల్పించినట్లు పేర్కొన్నారు. అనంతరం స్టేజిపై నుంచి వందలాదిమంది అభిమానులకు ఆమె అభివాదంచేశారు. పలు పాటలకు డ్యాన్స్ చేసి అలరించారు. కాగా రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న రాజాంలో సీఎంఆర్ షాపింగ్‌మాల్ ఏర్పాటు ఎంతో అవసరమని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ తెలిపారు. వస్త్రాలు, ఇతర అవసరాల కోసం ఈ ప్రాంత ప్రజలు విజయ నగరం, విశాఖ వంటి దూరప్రాంతాలకు వెళ్లే అవసరం ఇకపై ఉండదని చెప్పారు.
యువత మత్తుకు దూరంగా ఉండాలి
యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, తాత్కాలిక సుఖం కోసం బంగారం వంటి భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దని సినీనటి శ్రీలీల పిలుపుని చ్చారు. రాజాంలో రాజాంటౌన్ సీఐ కె.అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మత్తుపదార్ధాలు జీవితాలను చిత్తుచేస్తా యన్న విషయాన్ని యువత గుర్తించాలని పిలుపునిచ్చారు. ఫైౖర్‌సేఫ్టీ కార్యక్రమాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.