Share News

Sravana Festive Buzz శ్రావణ సందడి

ABN , Publish Date - Aug 01 , 2025 | 11:52 PM

Sravana Festive Buzz ఉత్తరాంధ్రుల ఆరాధ్యదేవం పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా తెల్లవారు జామునే పరిసర ప్రాంతాల నుంచి భారీగా భక్తజనం తరలివచ్చారు. దీంతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి.

Sravana Festive Buzz శ్రావణ సందడి
కుంకుమ పూజలు చేస్తున్న మహిళలు

పాలకొండ, ఆగస్టు1(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్యదేవం పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా తెల్లవారు జామునే పరిసర ప్రాంతాల నుంచి భారీగా భక్తజనం తరలివచ్చారు. దీంతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. ప్రత్యేక అలంకరణల్లో ఉన్న అమ్మవారిని వారు దర్శించుకుని పులకించిపోయారు. ప్రధాన అర్చకుడు డి.లక్ష్మీ ప్రసాదశర్మ ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మంది మహిళా భక్తులు కుంకుమపూజలు, లలితా పారాయణం నిర్వహించారు. ఈవో వీవీ సూర్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - Aug 01 , 2025 | 11:52 PM