Share News

ప్రతి ఒక్కరిలో క్రీడాస్ఫూర్తి అవసరం

ABN , Publish Date - Dec 06 , 2025 | 11:56 PM

ప్రతి ఒక్కరిలో క్రీడాస్ఫూర్తి అవస రమని, క్రీడల ద్వారా ఆత్మస్తైర్యం, నాయకత్వలక్షణాలు పెరుగుతాయని ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. శనివారం స్థానిక రాజా కళాశాల మైదానం లో అంబేడ్కర్‌ పోరాటసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సోరు సాంబయ్య ఆధ్వర్యంలో ఉత్తరాంధ్రస్ధాయి వాలీబాల్‌ పోటీలు ప్రారంభమయ్యాయి.

ప్రతి ఒక్కరిలో క్రీడాస్ఫూర్తి అవసరం
వాలీబాల్‌ పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బేబీనాయన

బొబ్బిలి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరిలో క్రీడాస్ఫూర్తి అవస రమని, క్రీడల ద్వారా ఆత్మస్తైర్యం, నాయకత్వలక్షణాలు పెరుగుతాయని ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. శనివారం స్థానిక రాజా కళాశాల మైదానం లో అంబేడ్కర్‌ పోరాటసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సోరు సాంబయ్య ఆధ్వర్యంలో ఉత్తరాంధ్రస్ధాయి వాలీబాల్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. వెటరన్‌ వాలీబాల్‌ క్రీడాకారుడు గురాన రామకృష్ణ ఆధ్వర్యంలో ఫిజికల్‌ డైరెక్టర్లు గిరడ ప్రభాకరరావు, ఇనుగంటి విజయ్‌కుమార్‌లు రిఫరీలుగా వ్యవహరించారు. సీనియర్‌ న్యాయవాది ఎస్‌జె విల్సన్‌ బాబా, మామిడి రామారావు, కనకమహేశ్‌పట్నాయక్‌, అణగారిన వెనుకబడిన వర్గాల సంక్షేమ ఐక్యవేదిక అధ్యక్షుడు రేజేటి రమేష్‌, పర్తాపు చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 11:56 PM