Share News

Housing Constructions గృహ నిర్మాణాలు వేగవంతం

ABN , Publish Date - Sep 07 , 2025 | 12:03 AM

Speeding Up Housing Constructions గృహ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. శనివారం హెచ్‌.కారాడవలస లేఅవుట్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. మంజూరైన 181 గృహాల్లో కొద్దిస్థాయిలో మాత్రమే గృహ నిర్మాణాలు జరగడంపై అధికారులను ప్రశ్నించారు.

  Housing Constructions  గృహ నిర్మాణాలు వేగవంతం
ఇళ్ల నిర్మాణాల పరిస్థితిపై ఆరా తీస్తున్న క‌లెక్ట‌ర్‌

పార్వతీపురం రూరల్‌, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): గృహ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. శనివారం హెచ్‌.కారాడవలస లేఅవుట్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. మంజూరైన 181 గృహాల్లో కొద్దిస్థాయిలో మాత్రమే గృహ నిర్మాణాలు జరగడంపై అధికారులను ప్రశ్నించారు. లబ్ధిదారులతో మాట్లాడి అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని, దానిని వినియోగించుకొని గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో గృహ నిర్మాణ సంస్థ ఇన్‌చార్జి పీడీ పి.ధర్మచం ద్రారెడ్డి, పార్వతీపురం ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరాజు ఉన్నారు.

జిల్లాలో 783 మెట్రిక్‌ టన్నుల యూరియా

పార్వతీపురం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రస్తుతం 783 మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు. ఇందులో రైతు సేవా కేంద్రాల వద్ద 613 టన్నులు ఉండగా, ప్రైవేటు దుకాణాల్లో 170 టన్నులు ఉన్నట్టు పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవరంలేదన్నారు. శనివారం మరో 226 టన్నులు శ్రీకాకుళం రైలు హెడ్‌ నుంచి సరఫరా అయినట్లు వివరించారు. భామిని, జీఎల్‌పురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, పాలకొండ, పార్వతీపురం, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాలకు ఒక్కో మండలానికి 20 టన్నులు చొప్పున గరుగుబిల్లికి 26 టన్నులు అందించనున్నట్లు వెల్లడించారు. తాజాగా ప్రైవేట్‌ డీలర్ల ద్వారా 275 టన్నుల యూరియా సరఫరా అయినట్టు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 1240 టన్నుల డీఏపీ, 1328 కాంప్లెక్స్‌ ఎరువులు, 680 పొటాష్‌, 880 సూపర్‌ పాస్పేట్‌ ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎవరైనా యూరియా అధిక ధరలకు అమ్మితే సమీపంలో ఉన్న మండల వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించారు.

Updated Date - Sep 07 , 2025 | 12:03 AM