మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయండి
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:30 AM
జిల్లాలోని వివిధ సంక్షేమ వసతి గృహాలకు ఈ నెలాఖరు నాటికి మరుగుదొడ్ల సదుపాయం కల్పించాల ని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు.
కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్
విజయనగరం కలెక్టరేట్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యో తి): జిల్లాలోని వివిధ సంక్షేమ వసతి గృహాలకు ఈ నెలాఖరు నాటికి మరుగుదొడ్ల సదుపాయం కల్పించాల ని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. గురువా రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సంబంధిత అధికా రులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా సంక్షేమ వసతి గృహాలకు మరుగుదొడ్ల సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 15 సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందన్నారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా 39 వసతి గృహాలకు మరుగుదొడ్ల నిర్మాణా న్ని వెంటనే ప్రారంభించాలని చెప్పారు. గిరిజన సంక్షే మ శాఖ పరిధిలో ఉన్న 149 హాస్టళ్లలో ఎన్ని చోట్ల మరుగుదొడ్ల అవసరం ఉన్నాయో గుర్తించేందుకు సర్వే పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, సోషల్ వెల్ఫేర్ డీడీ అన్నపూర్ణ, బీసీ సంక్షేమ అధికారి జ్యోతిశ్రీ, గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
భూగర్భ జలాల పెంపుపై దృష్టి
రాష్ట్రమంతటా భూగర్భ జలాలు పెంపొందించే దిశగా సీఎం కృషి చేస్తున్నారని.. అందుకు అనుగుణం గా కలెక్టర్లు దృష్టి సారించాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. గురువారం రాత్రి కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆయన మాట్లాడా రు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షించా రు. జిల్లాలోని 215 గ్రామాల్లో చెరువులు, కల్వర్టుల మరమ్మతులకు త్వరితగతిన ప్రణాళిక తయారు చేయా లన్నారు. వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలని డ్వామా పీడీ, నీటి పారుదల అధికారులను ఆదేశించా రు. జిల్లాలో రోజుకు 100 చెరువుల నిర్దేశించుకొని పను లు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో తగినంత యూరి యా నిల్వలు ఉన్నాయని సీఎస్‌కు వివరించారు. ఈ సమావేశంలో జేసీ సేతు మాధవన్, సీపీవో బాలాజీ తదితరులు పాల్గొన్నారు.