Share News

ఫిర్యాదుల పరిష్కారంలో వేగం అవసరం

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:11 AM

ప్రజా ఫిర్యాదుల పరిష్కా రంలో వేగం, నాణ్యత రెండింటిపై దృష్టి పెట్టాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదే శించారు.

ఫిర్యాదుల పరిష్కారంలో వేగం అవసరం

  • కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కా రంలో వేగం, నాణ్యత రెండింటిపై దృష్టి పెట్టాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదే శించారు. శనివారం పీజీఆర్‌ఎస్‌పై టెలికా న్ఫరెన్స్‌ నిర్వహించిన కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి విభాగం నుంచి ఎస్‌ఎల్‌ఏ గడువులో ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆలస్యంగా పరిష్కరించి న ఫిర్యాదులపై సమీక్షించి... కారణాలను నమోదు చేయాలని ఆదేశించారు. ప్రీ ఆడిట్‌ దశల్లో ఉన్న ఫిర్యాదులపై దృష్టి పెట్టాలన్నారు. రీ ఓపెనింగ్స్‌ నివారించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యధిక పిర్యాదులు రెవెన్యూ శాఖలోనే ఉన్నందున, వాటిపై ప్రత్యేక పర్య వేక్షణ ఉండాలని సూచించారు. దాదాపు 44శాతం అసంతృప్తి నమోదు కావడంపై కలెక్టర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అసంతృప్తి కేసులు సరిగా నమోదు చేయడంలో, డేటా అప్టేట్‌ చేయ డంలో నిర్లక్ష్యం కనబరుస్తున్న విభాగాలపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. వీఐపీల ఫిర్యాదుల పరిష్కారం విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నా రు. జిందాల్‌ భూ సమస్యలపై ఆర్‌డీవో స్థాయిలో పరిశీలించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జేసీ సేతుమాధవన్‌, డీఆర్‌వో శ్రీనివాస్‌మూర్తి, పీజీ ఆర్‌ఎస్‌ నోడల్‌ అధికారి మురళి పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2025 | 12:11 AM