Share News

సిరిమాను చెట్లకు ప్రత్యేక పూజలు

ABN , Publish Date - May 31 , 2025 | 12:20 AM

మన్యం జిల్లా కేంద్ర ప్రజల ఇల వేల్పులు ఇప్పలపోలమ్మ, యర్రకంచమ్మల సిరిమాను చెట్లకు ఉత్సవ కమిటీల సభ్యు లు ప్రత్యేక పూజలు చేశారు.

సిరిమాను చెట్లకు ప్రత్యేక పూజలు

పార్వతీపురం టౌన్‌, మే 30 (ఆంధ్ర జ్యోతి): మన్యం జిల్లా కేంద్ర ప్రజల ఇల వేల్పులు ఇప్పలపోలమ్మ, యర్రకంచమ్మల సిరిమాను చెట్లకు ఉత్సవ కమిటీల సభ్యు లు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం నుంచి ఉత్సవాలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని నాయుడు వీధిలో గల ఇప్పల పోలమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం రెడ్డి వీధి శివారుల్లో గల బుగత జగన్నాథం తోటలోని సిరిమాను చెట్టుకు ఉత్సవ కమిటీ సభ్యులు పుసుపు, కుంకుమలతో పూజలు చేశారు. అనంతరం గ్రామ రైతులు సిరిమాను చెట్టును ఇప్పలపోలమ్మ ఆలయం వద్దకు తీసుకువచ్చారు. ఇప్పలపోలమ్మ, సోదరి జగన్నాఽథపురం యర్రకంచమ్మ తల్లి సిరిమా ను చెట్టును రాధమ్మపేట సమీపంలోని రెడ్డి సీతారాం పొలంలో గుర్తించారు. శుక్ర వారం ఉదయం మేళతాళాల మధ్య యర్ర కంచమ్మ సిరిమాను చెట్టు వద్ద పూజారి నక్కా వాసు, ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం వద్దకు తరలించారు.

Updated Date - May 31 , 2025 | 12:20 AM