ప్రత్యేకావసరాల పిల్లలపై శ్రద్ధ వహించాలి
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:08 AM
ప్రత్యేకా వసరాల పిల్లల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించా లని జిల్లా ఉపవిద్యాశాఖఅధికారి కేవీ రమణ కోరారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ ప్రాంగణంలో భవితకేంద్రంలో జిల్లా సమగ్రశిక్షా, విద్యాశాఖ ఆధ్వ ర్యంలో విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లోగల ప్రత్యేకావసరాల పిల్లలకు ఉచిత ఉపకరణాలకు వైద్య నిర్ధారణ శిబిరం నిర్వ హించారు.
డెంకాడ, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రత్యేకా వసరాల పిల్లల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించా లని జిల్లా ఉపవిద్యాశాఖఅధికారి కేవీ రమణ కోరారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ ప్రాంగణంలో భవితకేంద్రంలో జిల్లా సమగ్రశిక్షా, విద్యాశాఖ ఆధ్వ ర్యంలో విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లోగల ప్రత్యేకావసరాల పిల్లలకు ఉచిత ఉపకరణాలకు వైద్య నిర్ధారణ శిబిరం నిర్వ హించారు. ఈసందర్భంగా విజయనగరం, నెల్లిమర్ల, పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాల నుం చి 160 మంది పాల్గొనగా వీరిలో 135 మంది వివిధ రకాల ఉపకరణాలకు ఎంపికయ్యారు. కార్యక్రమం లో ఎంఈవోలు ఆర్.కృష్ణ, బి.పాపినాయుడు, ఎం.రమణమూర్తి, సహిత విద్య సహ కోఆర్డినేటర్ ఎం.భారతి పాల్గొన్నారు.