నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:25 AM
జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు ఎస్పీ దామోదర్ తెలిపారు.
- ఎస్పీ దామోదర్
విజయనగరం క్రైం, డిసెంబరు 14 ( ఆంధ్రజ్యోతి): జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు ఎస్పీ దామోదర్ తెలిపారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ నగరంలోని 80 ప్రాంతాల్లో 400 మంది పోలీసులతో వాహన తనిఖీలు చేపట్టారు. వాహన చోదకులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. వాహన పత్రాలు సరిగా లేని వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ తనిఖీల్లో ఇద్దరు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 33 మంది ఎస్‌ఐలతో పాటు 350 మంది సిబ్బందిని వినియోగించామన్నారు. వాహన పత్రాలు సక్రమంగా ఉన్నదీ లేనిదీ గుర్తించి, పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు మార్పులు చేసి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలను కూడా సీజ్ చేస్తామన్నారు. రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. మద్యం సేవించి వాహనం నడిపిన సుమారు 50 మందికి జైలు శిక్ష విఽధించే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. ఈతనిఖీల్లో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.