పోలీసు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:22 AM
జిల్లాలో పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ఎస్పీ దామోదర్ తెలిపారు.
విజయనగరం క్రైం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ఎస్పీ దామోదర్ తెలిపారు. జిల్లా పోలీ సు కార్యాలయంలో మంగళవారం పోలీసు ఉద్యోగుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా వారి ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు జిల్లా పోలీసు ఉద్యోగులు క్రెడిట్ సొసైటీ ఏర్పాటైందన్నారు. తక్కువ వడ్డీతో సొసై టీ ద్వారా రుణాలు పొందే పోలీసు ఉద్యోగులు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోగలుగుతున్నారన్నారు. 2024-25 సంవత్సరానికి వచ్చిన ఆదాయ, వ్యయాలు సభ్యులు వివరించారు. సర్వీసు ఆధారంగా ఇప్పటికే రూ.3లక్షల నుంచి రూ.5.లక్షల వరకూ వ్యక్తిగత రుణా లుగా ఆడపిల్లల వివాహాల నిమిత్తం రూ.8లక్షలు అందిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఏఎస్‌పీ సౌమ్యలత, డీఎస్పీ కోటిరెడ్డి, ఎస్‌బీ సీఐలు లీలారావు, విద్యాసాగర్, ఆర్‌ఐలు గోపాలనాయుడు, రమేష్‌తో పాటు కో-ఆపరేటివ్ కార్యదర్శి నీలకంఠం నాయుడు, డైరక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు.