Share News

Malaria Prevention మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - May 28 , 2025 | 11:41 PM

Special Measures for Malaria Prevention జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా నివారణకు వైద్య శాఖ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. వ్యాధి తీవ్రత తగ్గించి.. రోగులకు అవసరమైన వైద్యసేవలు అందించే బాధ్యతను హెల్త్‌ అసిస్టెంట్లకు అప్పగించింది. గతంలో ఫ్యామిలీ పిజీషియన్లుగా ఉన్న వారిని మలేరియా శాఖకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

  Malaria Prevention మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు

ఏజెన్సీ ప్రాంతాలకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ

పార్వతీపురం, మే 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా నివారణకు వైద్య శాఖ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. వ్యాధి తీవ్రత తగ్గించి.. రోగులకు అవసరమైన వైద్యసేవలు అందించే బాధ్యతను హెల్త్‌ అసిస్టెంట్లకు అప్పగించింది. గతంలో ఫ్యామిలీ పిజీషియన్లుగా ఉన్న వారిని మలేరియా శాఖకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు సుమారు 134 మందిని కేటాయించారు. గతంలో అనేక మంది హెల్త్‌ అసిస్టెంట్లుమైదాన ప్రాంతాలకే పరిమితమయ్యారు. తాజాగా వారిని ఏజెన్సీలో గ్రామాలకు పంపించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా రెండు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో వారు విధులు నిర్వర్తించనున్నారు. ‘జిల్లాలో పూర్తిస్థాయిలో మలేరియా నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. దీనిలో భాగంగానే రెండు ఐటీడీఏల పరిధిలో గతంలో పనిచేసిన హెల్త్‌ అసిస్టెంట్లు కంటే అదనంగా మరికొంతమందిని ఏజెన్సీ ప్రాంతానికి నియమించాం.వారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూవైద్య సేవలు అందించాల్సి ఉంది. ఈ ఏడాది మలేరియాఅదుపులో ఉంది. మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధులపై వైద్య ఆరోగ్యశాఖ తీసుకున్న చర్యలకు ప్రజలు కూడా సహకరించాలి.’ అని డీఎంహెచ్‌వో భాస్కరరావు కోరారు.

Updated Date - May 30 , 2025 | 03:05 PM