Special Laws గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:24 PM
Special Laws for the Welfare of Tribals గిరిజనుల సంక్షేమానికి అనేక చట్టాలు ఉన్నాయని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎం.బబిత తెలిపారు. రాజ్యాంగంలో వారికి ప్రత్యేక హక్కులు కల్పించినట్లు చెప్పారు. మంగళవారం చిన మరికి గ్రామంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.
పార్వతీపురం రూరల్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): గిరిజనుల సంక్షేమానికి అనేక చట్టాలు ఉన్నాయని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎం.బబిత తెలిపారు. రాజ్యాంగంలో వారికి ప్రత్యేక హక్కులు కల్పించినట్లు చెప్పారు. మంగళవారం చిన మరికి గ్రామంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజనుల సాధికారిత, సమానత్వం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు, ప్రణాళికలు అమలు చేస్తున్నా యన్నారు. వాటిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. అదనపు జిల్లా న్యాయాధికారి ఎస్.దామోదరరావు మాట్లాడుతూ.. గిరిజనులకు ఆధారమైన భూమి, అడవులను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు కల్పించిన హక్కులు తోడ్పడతాయని తెలిపారు.
సత్ప్రవర్తనతో శిక్షణను పూర్తి చేయండి
బెలగాం : సత్ప్రవర్తనతో మెలిగి ఖైదీలు శిక్షణను పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎం.బబిత సూచించారు. మంగళవారం పార్వతీపురం సబ్ జైలులో వసతులను పరిశీలించారు. ఆహారం, వైద్య సౌకర్యాలు, ఖైదీల శారీరక, మానసిక ఆరోగ్యంపై ఆరా తీశారు. అనంతరం నాణ్యమైన ఆహారం అందుతుందా? లేదా అని ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. జైలులో రికార్డులను పరిశీలించిన అనంతరం ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్‌పై వివరించారు. అడ్వకేట్, పారా లీగల్ వాలంటీర్ ఖైదీలకు అవసరమైన న్యాయసలహాలు అందిస్తారని చెప్పారు. ఆమె వెంట లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ ఎ.కృష్ణప్రసాద్, పార్వతీపురం అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి జె.సౌమ్యజోష్ఫిన్, పార్వతీపురం రూరల్ సీఐ రంగనాఽథం తదితరులు ఉన్నారు.