Tribal Students గిరిజన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:12 PM
Special Focus on Tribal Students గిరిజనసంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, విద్యాప్రమాణాల స్థాయిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఆదేశించారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాల యంలో ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎం, ప్రిన్సిపాళ్లు, హెచ్‌డబ్ల్యువోలతో సమీక్షించారు.
సీతంపేట రూరల్, డిసెంబరు31(ఆంధ్రజ్యోతి): గిరిజనసంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, విద్యాప్రమాణాల స్థాయిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఆదేశించారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాల యంలో ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎం, ప్రిన్సిపాళ్లు, హెచ్‌డబ్ల్యువోలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు రక్తపరీక్షలు చేయించాలి. పాఠశాలల్లో ఫ్రైడే డ్రైడే క్యాంప్‌ను నిర్వహించాలి. ముస్తాబు, విద్యాప్రగతి కార్యక్రమాలు పక్కాగా చేపట్టాలి. తరగతి గదులతో పాటు పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. గిరిజన విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలి. పాఠశాలల్లో ఆర్‌వో ప్లాంట్లు సక్రమంగా పనిచేసేలా చూడాలి. మరుగుగొడ్ల నిర్వహణలో భాగంగా సెప్టెక్‌ట్యాంక్‌లను ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయించాలి.’ అని తెలిపారు. ఈ సమావేశంలో డీడీ అన్నాదొర, డిప్యూటీ ఈవో రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.